సెక్రటేరియట్‌లో మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన..

60
- Advertisement -

తెలంగాణ నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో రెండు మసీదు నిర్మాణానికి గురువారం శంకుస్థాపన జరిగింది. జామియా నిజామియా వర్సిటీ చాన్స్‌లర్‌ మౌలానా ముఫ్తీ ఖలీల్‌ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్‌ అలీ, జామియా నిజామియా షేక్‌ జామియా,ముఫ్తి గియాస్‌లతో పాటు ఎమ్మెల్యేలు అక్బరుద్దిన్‌ ఓవైసీ,అహ్మద్‌ పాషా ఖాద్రీ, దానం నాగేంద్రర్‌, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్‌ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు సచివాలయంలో రెండు మసీదులకు శంకుస్థాపన జరిగిందని.. అద్భుతమైన శైలిలో ఈ మసీదులు నిర్మిస్తామన్నారు. ఇదివరకే రూపొందించిన టర్కీ మసీదుల నమూనాల ప్రకారం మసీదుల నిర్మిస్తామని మంత్రి పేర్కొన్న్నారు. సీఎం కేసీఆర్‌ లౌకికవాది అని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చారన్నారు. తెలంగాణ సచివాలయంలోని మసీదులకు దేశంలోనే విశిష్టమైన, ఆదర్శవంతమైన స్థానం ఉంటుందని మంత్రి అన్నారు.

- Advertisement -