పల్లె ప్రగతి స్ఫూర్తితో క‌రోనాకు చెక్‌

308
mp vinod
- Advertisement -

కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రజలు సమస్టీగా చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు స్ఫూర్తినిచ్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

గ్రామాల్లో సమగ్రాభివృద్ధికి, శుభ్రత కోసం ప్రజలందరూ సమస్టీగా కదిలి చేసిన కృషి అనుభవం.. కరోనా వైరస్ పై యుద్దానికి ఉపయోగపడిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమాలలాగే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో సర్పంచ్ లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, యువజన సంఘాలు, మహిళలు, పెద్దలు, ప్రజలు విశేషంగా కృషి చేస్తున్నారని వినోద్ కుమార్ వివరించారు.కరోనా మహమ్మారి గ్రామాల్లో కట్టడిగా ఉంటే.. పట్టణాలు తట్టుకుంటాయని వినోద్ కుమార్ అన్నారు.

ప్రతి అంశంలోనూ గ్రామాలు .. పట్టణాలు, నగరాలకు ఆదర్శమని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందన్నారు.ఏ కోణంలో చూసినా .. ప్రతి అంశంలో సీఎం కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న కార్యక్రమాలు మన కళ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నాయని వినోద్ కుమార్ వివరించారు.

పల్లె ప్రగతి కార్యక్రమాల్లో గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కదిలిన తరహాలోనే.. కరోనా పై కూడా అదే స్పూర్తితో సమస్టీగా నియంత్రణ చర్యలు చేపడుతున్నారని వినోద్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ గ్రామాలకు, కాలనీల్లో వ్యాప్తి చెందకుండా ఆయా ప్రాంతాల వాసులు బయటి వ్యక్తులు రాకుండా దిగ్భంధనం వంటి కార్యక్రమాలు చేపడుతుండటం హర్షణీయమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.కరోనా మహమ్మారి ని అంతమొందించే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

రాబోయే రోజులు మరింత క్లిష్ట తరమైనవని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కఠినమైన దీక్షతో వ్యవహరించి కరోనా వైరస్ ను పారదోలేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -