తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే మీకు ఇబ్బందులు ఏంటి..? అని కేంద్రాన్ని,బీజేపీ నేతలను ప్రశ్నించారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. హన్మకొండ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్..కాశ్మిర్ లో అసెంబ్లీ సీట్లు పెంచుతున్న మోడీ ప్రభుత్వం తెలంగాణ- ఆంద్రప్రదేశ్ లో ఎందుకు సీట్లు పెంచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒకే దేశం – ఒకే న్యాయం అంటున్న మోడీ… కాశ్మీర్ కు ఒక న్యాయం తెలుగు రాష్ట్రాలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ఉత్తర భారతదేశానికి చెందిన పార్టీ….-తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచినా- పెంచక పోయినా బీజేపీ గెలిచేది లేదని కేంద్రం వివక్ష చూపుతుందని ఎద్దేవా చేశారు.
దీనిపై రాజకీయ విశ్లేషణ జరగాలి..కేంద్రం నిధులు ఇవ్వడంలోనూ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందన్నారు. కేంద్రానికి కాశ్మీర్, గుజరాత్ తప్ప సౌత్ ఇండియాలోని రాష్ట్రాలు గుర్తుకు రావడం లేదని…బీజేపీ ఎంపీలు మీకు తెలంగాణపై ప్రేమ ఉంటే..దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని…ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆ చట్టం అమలు చేయాలన్నారు.లేకపోతే కేంద్రం దిగి వచ్చేలా పోరాటాలు చేపడతాం అన్నారు.