హన్మకొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

1
- Advertisement -

ఈ నెల 22వ తేదీన హన్మకొండలో ‘జన చైతన్య సభ’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ వెల్లడించారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. హన్మకొండలో నిర్వహించనున్న జన చైతన్య సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని తెలిపారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఈ సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు పేర్కొన్నారు.

Also Read:KTR:గేమ్ ఛేంజర్స్..బుక్‌ లాంఛ్

పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరనుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని పార్టీ నాయకులు పిలుపునిస్తున్నారు.

ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో హన్మకొండలో జరగనున్న జన చైతన్య సభకు ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా కేటీఆర్ హాజరుకానుండటం, ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.

- Advertisement -