ఎలాంటి హీరో అయినా, ఎలాంటి సబ్జెక్ట్ అయినా దాన్ని పక్కా కమర్షియల్ గా తెరకెక్కించగలిగే సత్తా ఉన్న దర్శకుడిగా వివి వినాయక్ కు పేరుంది.యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని మిక్స్ చేసి ప్రేక్షకులకు నచ్చేలా తీయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో సినిమా చేస్తున్న వినాయక్..ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఏ సినిమాలోనైనా సరే .. ఈ సీన్ ను నేను ఇలా తీశానేంటి? అని ఎప్పుడైనా ఫీలయ్యారా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అందుకు వినాయక్ స్పందిస్తూ .. “ఛ .. ఈ సీన్ నేను తీసుండకూడదు అని నేను ఫీలైన సినిమా మాత్రం ‘సాంబ’. అందులో ఒక చెత్త సీన్ ఉంటుంది .. దాని గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ చెత్త సీన్ తీయడం ఇష్టం లేక .. కెమెరా పెట్టి కూడా తీసేశా. బానే వుంది కదా .. ఏవైంది అంటూ కొంతమంది ఒత్తిడి చేయడంతో .. నా వలన షూటింగ్ ఆగిపోకూడదని చేశాను .. ఎడిటింగ్ లోను తీయలేకపోయాను. ఎప్పటికీ నాకు అదొక బాధే .. నేను ఆ సీన్ తీసుండకూడదనే అనుకుంటా” అంటూ చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్తో అదుర్స్-2 తీసే ఆలోచన ఉందని…. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు. కథను బట్టి గోదావరి తీర ప్రాంతాలు సినీ పరిశ్రమ అనుకూలంగా ఉంటాయన్నారు.