దౌర్జన్యాలకు కేరాఫ్ కొండా ఫ్యామిలీ…

296
TRS
- Advertisement -

సెటిల్‌మెంట్లకు,దౌర్జన్యాలకు కేరాఫ్ కొండా దంపతులని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. కొండా దంపతులకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది టీఆర్ఎస్,కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. కొండా దంపతులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని…కేటీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు.

కేసీఆర్ బొమ్మతోనే ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చిందని గుర్తు చేశారు. కొండా మురళికి దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ ఏకగ్రీవంగా గెలవాలి అని సవాల్ విసిరారు. కేటీఆర్‌ను విమర్శిస్తే సూర్యునిపై ఉమ్మి వేసినట్లే చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ చురుగ్గా పాల్గొన్నారని…. ఉద్యమ సమయంలో కేటీఆర్‌పై ఎన్నో కేసులు నమోదయ్యాయని చెప్పారు. కొండా కుటుంబానికి టీఆర్‌ఎస్ తరపున టికెట్ ఇవ్వకపోవడంతో వరంగల్ ఈస్ట్‌లో ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారని వినయ్ భాస్కర్ తెలిపారు.

- Advertisement -