మార్చి 15న “వినరా సోదరా వీరకుమార”

255
vinara sodara vira kumara
- Advertisement -

ల‌క్ష్మీస్ సినీ విజ‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాంక జైన్ జంటగా స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌ ద‌ర్శ‌క‌త్వంలో,ల‌క్ష్మ‌ణ్ క్యాదారి నిర్మించిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీ “వినరా సోదరా వీరకుమార” ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.ఈ చిత్రాన్ని మార్చి 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ల‌క్ష్మ‌ణ్ క్యాదారి మాట్లాడుతూ “యూత్ మెచ్చే మంచి కమర్షియల్ అంశాలు ఉన్న చక్కటి చిత్రమిది. మా సినిమా చూసి నచ్చి మా చిత్ర డిజిటల్ రైట్స్ ని మ్యాంగో రామ్ గారు ఫ్యాన్సీ ఆఫర్ తో కొనుగోలు చేయడం శుభ పరిణామం. ఈ సందర్భంగా ఆయనకి మా కృతఙతలు. ఆయనిచ్చిన ఈ ఆఫర్ తో మాకు ఎంతో ఉత్సహానిచ్చింది. ఈ చిత్రం మార్చి 15 న విడుదల చేస్తున్నం .ప్రేక్షకులందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

చిత్ర దర్శకులు స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే వెరైటీ చిత్రమిది. మేము ఇటీవలే విడుదల చేసిన ఆడియోకు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా ఉంది. మా చిత్రాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అన్నారు.

శ్రీ‌నివాస్‌సాయి, ప్రియాక‌జైన్‌, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌, జైబోలో చంటి త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్ఃల‌క్ష్మీభూపాల‌, సంగీతంః శ్ర‌వ‌ణ్‌భ‌ర‌ద్వాజ్‌, కెమెరాఃర‌వి.వి, డాన్స్ఃఅజ‌య్‌సాయి, స్టంట్స్ఃరాబిన్‌సుబ్బు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ఃఅనిల్ మైలాపుర్ ప్రొడ్యూస‌ర్ఃల‌క్ష్మ‌ణ్‌క్యాదారి, డైరెక్ట‌ర్ఃస‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌.

- Advertisement -