ఫాస్ట్ ఆండ్ ఫూరియెస్ (ఎక్స్) సిరీస్‌లో భాగంగా వీన్ డీజిల్ నటిస్తున్న సినిమా ఫాస్ట్ ఎక్స్. ఆక్వామన్‌గా నటించి మెప్పించిన మోమోవా ఈ సినిమాలో థెరాన్‌తో విలన్‌గా పరిచయం కానున్నారు. జస్టిన్ లీన్ ఎక్స్ సిరీస్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత లూయిస్ లెటెరియన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో ట్రాన్స్‌ఫోర్టర్-2, ఎపిక్ ఫాంటసీ క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. యూనివర్సల్ స్టూడియోస్ రూపొందించిన ఈ సినిమాను మే19,2023న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాను 2021లో వచ్చిన F9 తర్వాత వస్తున్న ఫాస్ట్ ఎక్స్ సినిమా. ఇందులో డొమినిక్ టొరెట్టోగా విన్ డీజిల్, లెటీ ఒర్టిజ్‌గా మిచెల్ రోడ్రిగ్జ్, రోమన్ పియర్స్‌గా టైరీస్ గిబ్సన్, తేజ్ పార్కర్‌గా క్రిస్ “లుడాక్రిస్” బ్రిడ్జెస్, మియా టొరెట్టోగా జోర్డానా బ్రూస్టర్, రామ్‌సేగా నథాలీ ఇమ్మాన్యుయెల్, చార్లీజ్ థెరోన్, సి. జాకోబ్ టొరెట్టోగా మరియు జాసన్ స్టాథమ్ డెకార్డ్ షాగా నటించారు. వీరితో పాటుగా జాసన్ మోమోవా, కార్డి బి, బ్రీ లార్సన్ మరియు డానియెలా మెల్చియర్ కీలకపాత్రలను పోషించారు. మరీ ఇంకేందుకు ఈ సినిమా ట్రైలర్ చూసేయండి.
ఇవి కూడా చదవండి…