‘కేజీఎఫ్’ పై డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఒక తల్లి తన కొడుకుని గొప్పవాడు అవ్వమని చెబుతుంది. గొప్పవాడు అంటే బాగా సంపాదించి నలుగురికి ఉపయోగపడమని అంటూ మొదలుపెట్టి.. చివర్లో ఆ మొత్తాన్ని సముద్రంలో పడేస్తాడు. అలాంటి కుత్తే అవ్వమని తల్లి అడగడం.. అలాంటి కథని సినిమాగా తీస్తే మనం ఎగబడి చూశాం’ అంటూ కేజీఎఫ్ చిత్రాన్ని ఇంకా చాలా తక్కువ చేసి మాట్లాడాడు. ఐతే, తాజాగా తన వ్యాఖ్యలపై వెంకటేశ్ మహా వివరణ ఇచ్చాడు.
వెంకటేశ్ మహా ఒక పోస్ట్ చేస్తూ.. ఆ పోస్ట్ లో తన కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు. ‘ఒక బాధ్యతాయుతమైన దర్శకుడిగా నేను వాడిన భాష సరిగ్గా లేదు. దానికి క్షమాపణ చెబుతున్నాను. కానీ, నేను నా అభిప్రాయాన్ని మాత్రం వెనక్కి తీసుకోను. నేను చెప్పిన దానికి నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. నా అభిప్రాయాన్ని చెప్పే హక్కు నాకుంది. నేను కల్పిత పాత్రపై మాట్లాడాను. నేను ఒక వ్యక్తిని, దర్శకుడిని ఉద్దేశించి అలా అనలేదు’ అంటూ వెంకటేశ్ మహా చెప్పుకొచ్చాడు.
అలాగే, తన పై, తనతో పాటు ఉన్న దర్శకుల పై ట్రోల్స్ చేయడం మంచిది కాదు అంటూ వెంకటేష్ మహా చెప్పుకొచ్చాడు. ‘గత 24 గంటల్లో జరిగిన దానికి ఫ్యాన్స్ వ్యక్తపరుస్తున్న భావోద్వేగాలను గౌరవిస్తాను. కానీ నా పక్కన ఉన్న నా తోటి దర్శకులనూ ట్రోల్ చేయడం బాధాకరం. నా అభిప్రాయంపై వాళ్లు ట్రోల్స్ ఎదుర్కోవడం సరికాదు. వాళ్లు తెలుగు ఇండస్ట్రీలోని గొప్ప దర్శకులు’ అని వెంకటేష్ మహా అన్నాడు. అయినా KGFపై విమర్శలు చేసి.. ఇప్పటికీ నా అభిప్రాయాన్ని వెనక్కి తీసుకోను అంటూ వెంకటేష్ మహా చెప్పడం విడ్డూరంగా ఉంది.
ఇవి కూడా చదవండి…