ఘనస్వాగతానికి ఎన్టీఆర్ పాదాభివందనం

21
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ఆమెరికా గడ్డపై అడుగుపెట్టగానే.. అభిమానులు తెలుగు సింహం అంటూ నినాదాలు చేశారు. ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరయ్యేందుకు నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి ఎన్టీఆర్ బయల్దేరి వెళ్ళాడు. అయితే, తారక్ వస్తున్నాడు అని తెలిసి లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఎత్తున అక్కడకి చేరుకున్నారు. ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ పలికిన ఘనస్వాగతం చూసి అక్కడ ఉన్న తెల్లవారు కూడా ఆశ్చర్యపోయారు.

విమానాశ్రయం నుంచి జూనియర్ ఎన్టీఆర్ బయటకు వస్తున్న సమయంలో.. అభిమానులు అంతా ఒక్కసారిగా ‘జై ఎన్టీఆర్’ అంటూ పెద్ద పెద్దగా స్లోగన్స్ చేశారు. వారి అభిమానం చూసి ఎన్టీఆర్ కూడా చలించి పోయాడు. నేరుగా వారి దగ్గరకు వెళ్లి.. అందర్నీ పలకరిస్తూ అభివాదం చేశాడు. అనంతరం లాస్ ఏంజిల్స్‌లోనే తన ఫ్యాన్స్‌తో జూనియర్ ఎన్టీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఇంతకీ ఫ్యాన్స్‌తో ఎన్టీఆర్ ఏం మాట్లాడాడు అంటే.. ‘మీపై నాక్కూడా ఎంతో ప్రేమ ఉంది. కానీ, నేను చూపించలేకపోతున్నా. మీరంతా నా బ్రదర్స్. రక్త సంబంధం కంటే పెద్ద బంధం. ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా. మీ అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పారు. పైగా
శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. మార్చి 13న ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. ఇప్పటికే రాజమౌళి, రాంచరణ్, కీరవాణి అమెరికాకు వెళ్లారు.

ఇవి కూడా చదవండి…

బిజీ షెడ్యూల్ తో పవన్ పక్కా ప్లానింగ్

కుర్ర హీరోలు ఆలోచించుకోవాల్సిందే!

మహేష్ దర్శకులు బన్నీతో

- Advertisement -