ప్రేమించుకున్నారని.. నగ్నంగా ఊరేగించారు…

259
lovers
- Advertisement -

కాలం మారుతున్న కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.. వాళ్ల మూర్ఖత్వంలో దారుణాలకు పాల్పడుతున్నారు. బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలలోని వెనబడిన ప్రాంతాలలో దారుణమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రేమించుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో.. వారిని సభ్య సమాజం తల దించుకునే శిక్ష విధించారు గ్రామపెద్దలు. ప్రేమ జంటను నగ్నంగా ఊరంతా నడిపించారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్కరూ అడ్డుకోకపోగా.. వీడియోలు, ఫోటోలు తీస్తూ వినోదం చూశారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ జిల్లాలో జరిగింది.

woman-lover-stripped-and-paraded-naked-in-village

ఓ గ్రామానికి చెందిన యువకుడు మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో గ్రామపెద్దలు, యువతి, యువకుడి బట్టలు విప్పించి, తాడుతో కట్టేసి ఊరంగా ఊరేగించారు. ఇంత జరుగుతున్నా… ఏ ఒక్కరూ అడ్డుకోపోగా.. వీడియోలు తీస్తూ వినోదం చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేమ జంటను విడిపించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -