చేగువేరాతో నా కూతురుః ప‌వ‌న్ క‌ళ్యాణ్

1661
pawan kalyan dauhter with che guevara statue
- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈమ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. చిన్న‌ప్పుడు త‌న అన్న‌, అక్క‌ల‌తో దిగిన ఫోటోను నిన్న త‌న అభిమానుల పంచుకుంటే నేడు త‌న కూతురు పొలీనా అంజ‌నీ దిగిన ఫోటోను త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇక ప‌వ‌న్ క‌ళ్యాన్ స్పూర్తిగా తీసుకునే విప్ల‌కారుల‌లో చేగువేరా కూడా ఒక‌రు.

pawan-cheguvera

చేగేవేరా అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంతులేని అభిమానం అన్న విష‌యం తెలిసిందే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి నుంచి చేగువేరా ను స్పూర్తిగా తీసుకుని ప‌లు ఉద్య‌మాలు చేస్తున్నాడు. చేగువేరా నుంచి తాను ఎంతో స్పూర్తిని పొందాన‌ని ఆయ‌న చాలా సార్లు చెప్పారు. యువ‌త‌కు చేగువేరా స్పూర్తిదాయ‌కం అని.. ఇప్ప‌టికి ఆయ‌న‌ను చాలామంది ఫాలో అవుతార‌ని చెప్పారు.

Che-Guevara

ర‌ష్యాలోని సెయింట్ బ‌ర్గ్ లో ఉన్న మ్యూజియంలో చేగువేరా మైన‌పు విగ్ర‌హం ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు అంజ‌నీ పొలీనా ఆ మైనపు విగ్ర‌హం ప‌క్క‌న నిల‌బ‌డి దిగిన పోటోను ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న ట్వీట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. చేగువేరా నిల‌బ‌డ్డ స్టైల్ లోనే ప‌వ‌న్ కుమార్తే నిల‌బ‌డ‌డం చూసి అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. నెల్లూరులో త‌నాఉ ఇంట‌ర్ చ‌దువుతున్న‌ప్పుడు..తొలిసారి చేగువేరా గురించి చ‌దివాన‌ని..ఏదో ఒక రూపంలో ఆయ‌న నా జీవితంలో ఉంటున్నారు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్వీట్ చేశారు.

- Advertisement -