రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు వికారాబాద్ ఎస్పీ నారాయణ. తన కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మానవాళికి కావలసిన ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ ను అభినందించారు. మనం చెట్ల మీద ఆధారపడే జీవులం.
మొక్కలు లేకపోతే మానవాళి మనుగడ లేదు. అందుకోసం వాటిని ప్రతి ఒక్కరూ నాటి, పెరిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇందులో అందరూ స్వంచందంగా పాల్గొని మనిషికి మూడు మొక్కలు నాటాలని తెలిపారు. ఇందులో భాగంగా మరో ముగ్గురు డీఎస్పీలకు ఛాలెంజ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ డిఎస్పి సంజీవరావు, తాండూర్ డిఎస్పి లక్ష్మినారాయణ , ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులుకు చాలంజ్ ని నామినెట్ చేస్తున్నానని అన్నారు.