రివ్యూ: విజేత

237
vijetha movie review

మెగాఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన హీరో కల్యాణ్ దేవ్‌. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విజేత మూవీ టైటిల్‌తోనే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. కల్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్ నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా..?తొలి సినిమాతోనే కల్యాణ్ దేవ్ హిట్ కొట్టాడా లేదా
చూద్దాం…

కథ:

శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగి. కొడుకు రామ్‌(క‌ల్యాణ్ దేవ్‌) ఇంజనీరింగ్ చదివినా ఎలాంటి పనిచేయకుండా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తన ఎదురింట్లో అద్దెకు వచ్చిన జైత్ర‌(మాళ‌వికా నాయ‌ర్‌)ను ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. సీన్ కట్ చేస్తే ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ స్టార్ట్ చేసిన రామ్‌కి అనుకోని ఎదురుదెబ్బ తగులుతుంది. అదిచూసి శ్రీనివాస‌రావుకి గుండెపోటు వ‌స్తుంది.ఈ క్రమంలో రామ్‌కు ఓ నిజం తెలుస్తుంది..?రామ్‌కు తెలిసిన నిజం ఏంటి..?కుటుంబానికి ఏ విధంగా అండగా నిలబడ్డాడు అన్నదే విజేత కథ.

 review vijetha

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ తండ్రి,కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు,కెమెరా వర్క్,క్లైమాక్స్‌.చిరు అల్లుడిగా వెండితెరకు పరిచయం అయిన కల్యాణ్ దేవ్ ఫస్ట్ సినిమాతో పర్వాలేదనిపించాడు. నటన పరంగా తన పాత్రకు న్యాయంచేశాడు. హీరోయిన్ మాళవిక నాయిర్ తన అందంతో ఆకట్టుకుంది. ఇద్దరిమధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. తండ్రి పాత్రలో మురళీ శర్మ ఒదిగిపోయాడు. తన నటనతో కంటతడి పెట్టిస్తాడు. మిగితా నటినటుల్లో సుదర్శన్,నోయల్,కిరిటీ,తనికెళ్ల భరణి,రాజీవ్ కనకాల తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ ఫస్టాఫ్ రొటిన్‌గా సాగడం‌,లవ్ ట్రాక్,కథనం. సెకండాఫ్‌లో భావోద్వేగాల్ని పలికించే స్కోప్ ఉన్నా సింపుల్‌గా కథనాన్ని ముందుకు నడిపారు దర్శకుడు రాకేష్. అలేగా లవ్‌ ట్రాక్‌పై దృష్టిసారిస్తే బాగుండేది.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు ఎలాంటి వంకపెట్టలేం. సెంథిల్‌ సినిమాటోగ్రఫి సినిమా హైలైట్. హర్షవర్దన్‌ రామేశ్వర్‌ అందించిన సంగీతం బాగుంది. ఎమోషనల్‌ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత ప్లస్‌ అయ్యింది. ఎడిటింగ్ పర్వాలేదు. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.

review vijetha

తీర్పు:

మధ్య తరగతి జీవితాల్లో కనిపించే ఇబ్బందులు, సర్దుబాట్ల ఆధారంగా తెరకెక్కిన చిత్రం విజేత. ఎమోషనల్ సన్నివేశాలు,క్లైమాక్స్ సినిమాకు ప్లస్ కాగా రోటిన్ కథనం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఓ ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే ఫీల్ గుడ్ మూవీ విజేత.

విడుదల తేదీ : 12/07/18
రేటింగ్ : 2.75/5
నటీనటులు : కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్
నిర్మాత : రజిని కొర్రపాటి
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
దర్శకత్వం : రాకేష్ శశి