త్వరలో ‘యూటర్న్’ ఫస్ట్‏లుక్..

275
samantha
- Advertisement -

రంగస్థలం సినిమా తరువాత అక్కినేని వారి కోడలు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘యూటర్న్’. థ్రిలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అనంతరం పాటల చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట.

Samantha-U-Turn-Movie

శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తుండగా..  పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భూమిక, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్దం అవుతోందట.

రంగస్థలంలో రామలక్ష్మిగా మంచి మార్కులు కొట్టేసిన సమంత ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. యూటర్న్ తర్వాత సమంతం, నయనతార మాదిరిగా లేడిఓరియెంటల్ చిత్రాలలో నటించాలనే ఆలోచనలో ఉన్నారట. మరి సమంతకు లేడి ఓరియెంటల్ చిత్రాలు కలిసొస్తాయో లేదా తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే.

- Advertisement -