స‌రిలేరు నీకెవ్వ‌రు.. రాములమ్మ రెడీ..!

479
vijayashanti
- Advertisement -

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ర‌ష్మిక మందన జోడీగా నటిస్తున్న చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. ఈ చిత్రాన్ని డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతుంది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో లేడీ మెగాస్టార్‌ విజయ శాంతి పాల్గొనడానికి సిద్ధమౌతున్నారు. కాగా పదమూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ స్క్రీన్‌ మీద నటించబోతున్నారు.అయితే ఈ సినిమా కోసం విజ‌య‌శాంతి దాదాపు 55 రోజులు డేట్స్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం.

vijayashanti

ఈ నేపథ్యంలో ఆగ‌స్ట్ 9న విజయశాంతి షూటింగ్‌లో జాయిన్‌ కానున్నట్లు సమాచారం. విజ‌య‌శాంతి చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఆమెకి సంబంధించిన స‌న్నివేశాల‌పై అనీల్‌ రావిపూడి ప్రత్యేక దృష్టి పెట్టిన‌ట్టు టాలీవుడ్‌లో వినిపిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది.

- Advertisement -