పెద్దల సభకు విజయేంద్రప్రసాద్, ఇళయరాజా

74
vijayendra prasad
- Advertisement -

దక్షిణాది కోటాలో రాజ్యసభకు నలుగురిని ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డే ఉన్నారు.

విజయేంద్రప్రసాద్‌ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయని కొనియాడారు. అనేక తరాలకు ఇళయరాజా సంగీతం వారధిగా నిలిచిందన్నారు. క్రీడా రంగంలో పీటీ ఉషా జీవితం స్ఫూర్తిదాయకమని , ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక రంగాల్లో హెగ్డే గొప్ప కృషి చేశారని కొనియాడారు.

తెలుగు, భారతీయ సినిమా స్థాయిని విశ్వవ్యాపితం చేసిన బాహుబలి సిరీస్‌తో పాటు భజరంగీబాయ్‌జాన్‌ తదితర చిత్రాలకు కథ అందించార విజయేంద్రప్రసాద్. ఇక సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఇళయరాజా. పరుగుల రాణిగా పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు పీటీ ఉషా. కెరీర్‌లో జాతీయ, ఆసియా స్థాయిలో పలు రికార్డులను బద్దలుకొట్టారు. గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి మార్గాలపై యువత ప్రేరణ పొందేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు వీరేంద్ర హెగ్డే.

- Advertisement -