‘లైగర్’ సినిమా దారుణాతి దారుణంగా ఫ్లాప్ అయిన తర్వాత హీరో విజయ్ దేవరకొండ సినిమాల ప్లానింగ్ పూర్తిగా మారిపోయింది. దీనికితోడు ఫలానా డైరెక్టర్ తో విజయ్ అంటూ వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. రోజురోజుకు విజయ్ సరసన డైరెక్టర్ల జాబితా పెరుగుతూనే వస్తోంది. రోజుకో దర్శకుడి పేరు వినిపిస్తూ వస్తోంది. తాజాగా శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ పేరు వినిపిస్తోంది. నిజానికి శ్యామ్ సింగరాయ్ సినిమా హిట్ అయిన తర్వాత, రామ్ తో సినిమా ఫిక్స్ అయింది. అది క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరిగింది. కానీ మధ్యలో మరేం అయిందో తెలియలేదు. తాజాగా రాహుల్ సాంకృత్యన్, విజయ్ దేవరకొండకు ఓ లైన్ చెప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కి కూడా కథ బాగా నచ్చిందట. అందుకే, ఈ సినిమాను డైరక్టర్ రాహుల్ సాంకృత్యన్ తోనే చేస్తా అని విజయ్ దేవరకొండ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అసలు రాహుల్ సాంకృత్యన్ కి మొదటి ఛాన్స్ ఇచ్చింది విజయ్ నే. వీరి కలయికలో వచ్చిన టాక్సీవాలా మంచి విజయాన్ని సాధించింది. పైగా తనకు మాస్ సినిమాల కన్నా ఫీల్ గుడ్ సినిమాలే బాగా వర్కౌట్ అవుతున్నాయనే ఒపీనియన్ కి విజయ్ దేవరకొండ వచ్చేశాడు. మరోపక్క శ్యామ్ సింగరాయ్ తో రాహుల్ సాంకృత్యన్ కి ఓ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అయింది. దీనికితోడు లైగర్ కంటే ముందే.. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లతో విజయ్ దేవరకొండ దారుణమైన ఫ్లాప్ లను చవి చూశాడు. మరోపక్క ఆగిపోయిన ఖుషీ ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. అందుకే.. రాహుల్ సాంకృత్యన్ తో విజయ్ కి సినిమా చేయడం చాలా అవసరం.
ఇవి కూడా చదవండి…