ఎఫ్‌3లో రాములమ్మ…!

689
vijayashanthi
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరుతో వెండి తెరై రీ ఎంట్రీ ఇచ్చిన నటి విజయశాంతి. దశాబ్దకాలం తర్వాత తిరిగి మేకప్ వేసుకున్న రాములమ్మ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి ఎఫ్2 కు సీక్వెల్‌ ఎఫ్‌3ఇ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ-వరుణ్‌ తేజ్‌తో పాటు విజయశాంతి కూడా కీ రోల్ పోషించనున్నట్లు సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ సందర్భంగా ఎఫ్‌3 కథను విజయశాంతికి వినిపించగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఎఫ్2ని 2019 సంక్రాంతికి విడుదల చేయగా ఎఫ్‌3ని 2021 సంక్రాంతికి విడుదల చేయాలని అనిల్ రావిపూడి భావిస్తున్నారు. ఎఫ్‌3ని దిల్ రాజు నిర్మిస్తుండగా త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

‘F3’ to Vijayashanthi. She has agreed to be part of this movie as well. Vijayashanthi is making comeback to the movie field in Anil Ravipudi’s ‘Sarileru Neekevvaru’.

- Advertisement -