పోలీస్, అదిరింది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విజిల్. విజయ్ సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్.అఘోరాం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
దీపావళి సందర్భంగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఒక ఛాంపియన్ ఫుట్‌బాలర్ జీవితం తన స్నేహితుడి మరణంతో ఎలా మలుపు తిరిగింది.. అతను మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా ఎందుకు వెళ్లాడు..? అతనికి ఎదురైన అవరోధాలు ఏంటి అనే కాన్సెప్ట్‌తో సినిమా తెరకెక్కింది. ఇప్పటికే సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
ప్రీమియర్ షో చూసిన వారి దగ్గరి నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. కొంత మంది సినిమా సూపర్ డూపర్ హిట్ అంటుంటే, కొంత మంది మాత్రం అస్సలు బాగాలేద ట్వీట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ అదిరిపోయిందట. రాయప్పన్ క్యారెక్టర్‌ను అట్లీ అద్భుతంగా డిజైన్ చేశారని అంటున్నారు. నయనతార చాలా క్యూట్‌గా ఉందని చెబుతున్నారు.