విజిల్ వేస్తున్న ఇళయ దళపతి విజయ్‌…

648
vijay
- Advertisement -

అదిరింది, స‌ర్కార్ సినిమలాతో తెలుగు మార్కెట్‌ను పెంచుకున్న హీరో తలా విజయ్‌. తాజాగా విజిల్‌ అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో తమిళ్‌లో బిగిల్ పేరుతో వస్తుండగా తెలుగులో విజిల్‌ అనే టైటిల్‌ని ఖరారుచేశారు.

ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేశారు. ఒలంపిక్స్ నేప‌థ్యంలో అక్కడ జరిగే అన్యాయాలపై ఈ మూవీ తెరకెక్కుతోంది.ఇందులో విజ‌య్ ఫుట్ బాల్ కోచ్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

గతంలో విజ‌య్ తో తెర‌కెక్కించిన తెరీ,మెర్స‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్స‌ల్’ కోసం ఏకంగా మెడిక‌ల్ మాఫియాను క‌దిలించాడు ద‌ర్శ‌కుడు అట్లీకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్‌నే టార్గెట్ చేస్తున్నాడు. దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కోసం విజయ్ రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్‌.

- Advertisement -