విజయ్ వర్సెస్ విజయ్ సేతుపతి

247
vijay sethupathi

నూతన సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్‌కు మాస్టర్‌గా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన ఇళయ దళపతి విజయ్‌ తాజాగా తన సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ ఇచ్చేశాడు. ఇప్పటివరకు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా సినిమా నుంచి మూడో లుక్ విడుదల చేశారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా ఓ వైపు విజయ్‌..మరోవైపు విజయ్ సేతుపతి ముఖాలపై గాయాలతో ఉన్న పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.

మా నగరం,ఖైదీ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా కాగా ఆండ్రియా, శాంతను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇద్దరు విజయ్‌లు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మ్యూజిక్ : అనిరుధ్, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్.