‘వారసుడు’ హిట్టా ? ఫట్టా ?

89
- Advertisement -

విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘వారిసు’ తెలుగులో వారసుడు టైటిల్ తో రెండ్రోజులు ఆలస్యంగా థియేటర్స్ లోకి వచ్చింది. దిల్ రాజు తెరకెక్కిన ఈ డబ్బింగ్ సినిమా తెలుగు ఆడియన్స్ ను మెప్పించిందా ? సినిమా హిట్టా ? ఫట్టా ?చూద్దాం.

కొన్నేళ్ళ క్రితం’బృందావనం’ వంటి ఫ్యామిలీ సినిమా తీసిన బ్లాక్ బస్టర్ కొట్టిన వంశీ పైడిపల్లి తర్వాత ఊపిరి , మహర్షి సినిమాలతో మెప్పించాడు. మహర్షి కి నేషనల్ అవార్డు కూడా దక్కింది. దీంతో వారసుడు అంటూ వంశీ పైడి పల్లి మరో ఫ్యామిలీ హిట్ కొడతాడాని అనుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ట్రైలర్ చూసి తెలుగు ప్రేక్షకులు ఊహించనట్టే వంశీ పైడిపల్లి విజయ్ తో ఓ రొటీన్ ఫ్యామిలీ సినిమా తీశాడు.

సినిమాలో పాత్రలు , సన్నివేశాలు తెలుగులో వచ్చిన కొన్ని సినిమాలను గుర్తుచేశాయి. ముఖ్యంగా బొమ్మరిల్లు , బ్రహ్మోత్సవం , లక్ష్మి సినిమాల ఛాయలు బాగా కనిపించాయి. ఇక విజయ్ ఫ్యాన్స్ ఆశించే యాక్షన్, సాంగ్స్ కూడా వారసుడు లో ఇన్ క్లూడ్ చేసి మాస్ ఫ్యాన్స్ ని మెప్పించాడు వంశీ పైడిపల్లి. అయితే సినిమాలో ఎమోషన్ మాత్రం పండలేదు. ఎమోషనల్ సీన్స్ లో సీనియర్ యాక్టర్స్ ఉన్నా ప్రేక్షకుడు ఎమోషన్ కి గురవ్వని పరిస్థితి. ముఖ్యంగా అన్న దమ్ముల డ్రామా వర్కవుట్ అవ్వలేదు. ఆ సన్నివేశాలన్నీ లక్ష్మి సినిమాను గుర్తుచేశాయి.

అయితే విజయ్ చేసిన ఫైట్స్ , రంజితమే , జయసుధ -విజయ్ మధ్య వచ్చే సీన్స్ మాత్రం ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా వారిసు తమిళ్ ప్రేక్షకులకి కాస్త కొత్తగా అనిపించే ఫ్యామిలీ అనిపించవచ్చు, కానీ తెలుగు ఆడియన్స్ కి మాత్రం రొటీన్ ఫ్యామిలీ డ్రామా అనిపిస్తుంది. మరి సంక్రాంతి రేస్ లో నిలిచిన విజయ్ ఈ డబ్బింగ్ సినిమాతో తెలుగులో ఎలాంటి హిట్ సాదిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -