తమిళంలో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా వున్న స్టార్ హీరో విజయ్. ఆయన నటించిన చివరి చిత్రం మెర్సల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. తెలుగులో అదిరింది టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రానికి ఇక్కడ ప్రేక్షకుల నుండి కూడా భారీ ఆదరణ లభించింది .అయితే ఇందులో జీఎస్టీకి సంబంధించిన డైలాగ్స్ తో పాటు దేవాలయాలు, వైద్యుల గురించి – కార్పొరేట్ హాస్పిటళ్ల గురించి విజయ్ పేల్చిన సెటైర్లు అనేక వివాదాలకి దారి తీశాయి.
బీజేపీ అధ్యక్షుడు హెచ్ రాజా ఈ చిత్రానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర యూనిట్ కి కమల్ హాసన్, రజనీకాంత్, విశాల్ , విజయేంద్ర ప్రసాద్ వంటి స్టార్స్ మద్దతు తెలపగా, ఈ వివాదం మరింత రాజుకుంది. దీంతో వెంటనే స్పందించిన విజయ్ ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టారు.
ఇప్పుడు తాజాగా విజయ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్‌కి ఇది 62వ సినిమా .. ఈ రోజున విజయ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాకి ‘సర్కార్’ అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ సిగరెట్ తాగుతూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆయనలా సిగరెట్ తాగుతున్న స్టిల్ ఇప్పుడు వివాదానికి కారణమైంది.
తమిళనాడు ఎంపీ .. మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ‘అన్బుమని రామదాస్’ విజయ్ పోస్టర్ పై స్పందించాడు. “ఈ పోస్టర్ ద్వారా సిగరెట్ ను ప్రమోట్ చేస్తున్నావా? ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక నటుడిగా స్మోకింగ్ ను ప్రమోట్ చేయకపోవడం నీ బాధ్యత” అంటూ ఆయన విమర్శించారు. ‘సినిమాల్లో సిగరెట్ తాగనని గతంలో అన్నావు .. ఇప్పుడు చేసిందేవిటి’ అంటూ ప్రశ్నించారు.
అంతేకాదు .. గతంలో ‘ఇకపై సినిమాల్లో సిగరెట్ తాగాను’ అంటూ విజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించిన పేపర్ కటింగ్ ను కూడా ఆయన ఈ ట్వీట్ కి జత చేశారు. దాంతో ఆయన ధోరణి పట్ల విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.
Shame on Actor Vijay for promoting Smoking in this first look of his next movie.#ActResponsibly #DoNotPromoteSmoking
— Dr ANBUMANI RAMADOSS (@draramadoss) June 21, 2018
You’ll look more stylish without that cigarette.#SmokingKills #SmokingCausesCancer pic.twitter.com/UUvzgrffHN
— Dr ANBUMANI RAMADOSS (@draramadoss) June 21, 2018