స్టాలిన్‌పై విజయ్ తీవ్ర విమర్శలు

3
- Advertisement -

టీవీకే అధ్యక్షుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ కూటమి రాజకీయాల గురించి మాట్లాడినప్పటికీ, కాంగ్రెస్‌కు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వడంపై మౌనం పాటించారని విజయ్ వ్యాఖ్యానించారు.

సేలంలో జరిగిన సభలో విమర్శలు చేసిన విజయ్.. “తమిళనాడులో కూటమి పనిచేయదని స్టాలిన్ స్వయంగా చెప్పారు” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వంలో చోటు ఇవ్వకపోవడం వల్ల అధికార కూటమిలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయని ఆయన సూచించారు.

కూటమి వ్యవహారాల్లో స్పష్టత లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతుందని విజయ్ విమర్శించారు. ప్రస్తుతం అధికార కూటమిలో కాంగ్రెస్ పాత్రపై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో, స్టాలిన్ వ్యాఖ్యలను ఉదహరిస్తూ విజయ్ రాజకీయ దాడిని మరింత పదును పెట్టారు.

Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

- Advertisement -