నిరాడంబరంగా విజయ్ శంకర్ వివాహం..

78
vijay shankar

టీమిండియా ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ వివాహం నిరాడంబరంగా జరిగింది. ఇవాళ ఉదయం వైశాలి విశ్వేశ్వరన్ ను పెళ్లి చేసుకున్నారు విజయ్ శంకర్‌. కొద్ది మంది కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వైశాలిని వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా స‌న్‌రైజ‌ర్స్ టీం విజయ్ శంకర్‌కి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపింది.

ఆగ‌స్టులో విజ‌య్ శంక‌ర్, వైశాలిల నిశ్చితార్ధం జ‌ర‌గ‌గా, ఆ వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను విజ‌య్ శంక‌ర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఎంగేజ్‌మెంట్ జరిగిందని అర్థం వచ్చేలా ఉంగరం ఎమోజి జతచేశాడు కాగా, వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజ‌య్ శంక‌ర్‌కు టీమిండియా ఆట‌గాళ్లు రాహుల్, చాహ‌ల్‌తో పాటు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.