ఆ హీరోలతో నటించే ప్రసక్తే లేదు!

6
- Advertisement -

వైవిధ్యమైన పాత్రలకే కేరాఫ్ అడ్రస్ విజయ్ సేతుపతి. ప్రస్తుతం తన 50వ సినిమా మహరాజాతో వస్తుండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మరో స్టార్ తో కలిసి సినిమా అంగీకరించినప్పుడు…ఆ పాత్రలో మనం ఎంత బాగా నటించినా.. చివరికి ఆశించిన పేరు మాత్రం మనకు రాదు. ఆ స్టార్ లాగే మనం కూడా ఆ సినిమా కోసం సమానంగా కష్టపడినా.. దానిని ఎవరూ గుర్తించరు అని తెలిపారు. అందుకే ఇకపై మల్టీస్టారర్‌ సినిమాలు చేయనని…అలాగే విలన్ పాత్ర పోషించనని చెప్పారు.

తన కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోందని..అవకాశం వస్తే దర్శకత్వం కూడా వహిస్తానని చెప్పారు. ప్రస్తుతం లైటింగ్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ లాంటి వాటి వైపు ఎక్కువగాదృష్టి సారిస్తున్నాను అని వెల్లడించారు.

Also Read:Sajjala:సజ్జల రాజీనామా..

- Advertisement -