మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మోస్ట్ ప్రెస్టీజియస్ 50వ మైల్ స్టోన్ మూవీ ‘మహారాజ’రిలీజ్ కి రెడీ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వంలో ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్స్ పై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనురాగ్ కశ్యప్ పవర్ ఫుల్ రోల్ లో నటించారు. విజయ్ సేతుపతికి ఇది 50వ సినిమా కావడంతో మెమరబుల్ హిట్ అందించడం కోసం దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హ్యుజ్ బడ్జెట్ తో లావిష్ గా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎన్‌విఆర్ సినిమా ఈ మూవీని ఏపీ, తెలంగాణలలోమ్యాసీవ్ గా రిలీజ్ చేయనుంది. ఈ సినిమా జూన్ 14న థియేట్రికల్ రిలీజ్ కానున్న నేపధ్యంలో హీరో విజయ్ సేతుపతి విలేకరుల సమావేశంలో మూవీ విశేషాలని పంచుకున్నారు.
50సినిమాలు పూర్తి చేసుకున్నారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది ?
-ఇది చాలా అద్భుతమైన జర్నీ. 50 సినిమాలు చేశాను. ఈ జర్నీలో దాదాపు 500 వందలకు పైగా కథలు విన్నాను. ఎంతోమందిని కలిశాను. హిట్స్, ప్లాప్స్ చూశాను. రిజల్ట్ ఏదైనా అది గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇది చాలా వండర్ ఫుల్ జర్నీ.
మహారాజ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
-ఇప్పటివరకూ చాలా రకాల సినిమాలు, క్యారెక్టర్స్ చేశాను. మహారాజలో చేసిన క్యారెక్టర్ నా గత సినిమాలకి డిఫరెంట్ గా వుంటుంది. నా క్యారెక్టర్ ఇంట్రోవర్ట్ గా వుంటుంది, అదే సమయంలో యాంగ్రీమ్యాన్ లా వుంటుంది. అదే టైం లో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ చాలా బ్యాలెన్సింగ్ గా వుంటుంది.
-మహారాజ కథ చాలా ఇంట్రస్టింగా వుంటుంది. 50వ సినిమా గా ఈ కథ బావుంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. అందరికీ నచ్చే కథ ఇది.
డైరెక్టర్ నితిలన్ సామినాథన్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-నితిలన్ చాలా చక్కగా సినిమాని ఎగ్జిక్యూట్ చేశారు. తనకి స్క్రీన్ ప్లే పై చాలా మంచి గ్రిప్ వుంది. స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చాలా స్పెషల్ గా వుంటుంది. అందరూ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. తను ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం చాలా బావుంది.
మీరు చేసే ప్రతి క్యారెక్టర్ చాలా నేచురల్ గా వుంటుంది. దీని కోసం ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారు?
-డైరెక్టర్ తో క్యారెక్టర్ గురించి లోతుగా చర్చించడం ఫస్ట్ హోమ్ వర్క్. ఇది చాలా ముఖ్యం. రోల్ ని అర్ధం చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. దిని కోసం డైరెక్టర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను.
ఇందులో మమతా మోహన్ దాస్, అభిరామి..ఇద్దరూ హీరోయిన్స్ గా కనిపిస్తారా ?
-అది మూవీ చూసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడే దాని గురించి చెప్పకూడదు. ఈ స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్. దాని గురించి ఎక్కువ చెబితే ఎక్స్ పీరియన్స్ స్పాయిల్ చేసినట్లు వుంటుంది.
ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి ?
-సుధన్ సర్ తో ఇది నా థర్డ్ ఫిల్మ్. ఆయన చాలా పాషన్ వున్న నిర్మాత. మంచి కథలు చేయడానికి ఇష్టపడతారు. చాలా సెన్సిబుల్ ప్రొడ్యూసర్. ఆయనతో మరో సినిమా చేయబోతున్నాను.
అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ గురించి
-కాంతార కు మ్యూజిక్ చేసిన అజనీష్ ఈ సినిమా అద్భుతమైన మ్యూజిక్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బావుటుంది. సాంగ్స్ కూడా చాలా బావుంటాయి.
50 సినిమాలు చేశారు. ఫ్యుచర్ జర్నీ ఎలా ఉండబోతుంది ?
-నేను ఏదీ క్యారీ చేయను. నార్మల్ థ్రిల్ తోనే వుంటాను. ఏదైనా డ్రీం వుంటే దానిపైన ఎక్కువ పెయిన్, వెయిట్ వస్తుంది, తర్వాత డిస్సాపాయింట్మెంట్ వస్తుంది. అందుకే నేను ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోను. సిన్సియర్ గా నా పని చేయడంపైనే ద్రుష్టి పెడతాను.
Also Read:హీరో విశ్వక్ సేన్ ..చక్రధారి
లీడ్ రోల్స్ చేస్తూనే క్యారెక్టర్ రోల్స్ చేయడం ఎలా అనిపిస్తుంది ?
క్యారెక్టర్ రోల్స్ తక్కువే చేశాను. అదీ కూడా ఫ్రండ్స్ కోసం చేశాను. రంజిత్ కోసం మైఖేల్ లో ఓ క్యారెక్టర్ చేశాను.
-తెలుగులో చేసిన ఉప్పెన లో చాలా స్ట్రాంగ్ రోల్ చేశాను. ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ తో కలసి నటించాను. చిరంజీవి గారిపై వున్న ఇష్టంతో సైరానరసింహా రెడ్డిలో చేశాను. అలాగే రజనీకాంత్ సర్, విజయ్, షారుక్ వీరందరిపై వున్న ఇష్టంతో వారితో కలిసి పని చేశాను.
తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసే అవకాశం ఉందా ?
-కథలు వింటున్నాను. మంచి కథ, ప్రొడక్షన్ తో కలసి పని చేయాలని వుంది.
మీరు డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు ?
-నాకు డైరెక్షన్ అండర్ స్టాండ్ అయితే మంచి కథ కుదిరితే ష్యూర్ గా డైరెక్షన్ ట్రై చేశాను.
-ఆల్రెడీ మూడు సినిమాలకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాశాను. నాకు కొంత అనుభవం వుంది.
మహారాజని ఎన్‌విఆర్ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది ?
-మహారాజ సినిమా వారికి చాలా నచ్చింది. చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచి ప్రమోషన్స్ చేశారు. తెలుగు ఆడియన్స్ మహారాజకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
-తమిళ్ లో మూడు సినిమాలు చేస్తున్నాను. హిందీలో ఓ ఫిలిం చేస్తున్నాను