విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారని.. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆన్ స్క్రీన్ మీద వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ‘గీతా గోవిందం’ అనే సినిమాలో మొదటిసారిగా విజయ్, రష్మిక స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అప్పటినుండే చాలామందికి వీరు ఫేవరెట్ ఆన్ స్క్రీన్ పెయిర్‌గా మారిపోయారు. ఇక ఆ మూవీ తర్వాత వెంటనే ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో కలిసి నటించారు విజయ్, రష్మిక. అప్పటినుండి వీరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు మొదలయ్యాయి.అంతేకాదు ఇటీవల వీరిద్దరూ ముంబైలో కెమెరా కంటికి చిక్కారు.
దీంతో వీరిపై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారే రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మీడియా సైతం ఈ అంశంపై కథనాలను ప్రచురిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ పెళ్లి వార్తలపై విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా అఫీషియల్ గా స్పందించాడు. ‘నాన్సెన్స్’ అంటూ కొట్టిపడేశాడు. ఇలాంటి వార్తలు తమకు అవసరం లేదని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రష్మిక, విజయ్ తమ తమ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ షూటింగ్ ఇటీవల కంప్లీట్ చేశారు. లైగర్ పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. అనంతరం విజయ్ దర్శకుడు సుకుమార్ తో మూవీ ప్రకటించారు.