విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఉదయ్‌పూర్‌లో ఉదయం 10:10 గంటలకు హిందూ సాంప్రదాయ పద్దతిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో విరోష్ జంట వివాహం ఘనంగా జరిగింది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట, ఏడు సంవత్సరాల ప్రేమ తర్వాత ఇటీవలే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.
సంగీత్ కార్యక్రమానికి సంబంధించిన ఒక ఫోటో ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో అభిమానులు అధికారిక ఫోటోల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంగీత్ వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ రష్మికకు కుటుంబ వారసత్వాన్ని సూచించే సంప్రదాయ బంగారు గాజులను బహుమతిగా అందించారు. ఇది కుటుంబ ఆమోదం, ప్రేమ, సంప్రదాయాల కొనసాగింపునకు ప్రతీకగా భావిస్తున్నారు.
విజయ్ స్నేహితులు ఆయన హిట్ పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ వేడుకను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. పెళ్లిని ప్రైవేట్‌గా నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, వేడుక ప్రాంగణం బయట ఉన్న పాపరాజీకి మూడు రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసి తమ కృతజ్ఞతను తెలియజేశారు.
Also Read:పింక్ సాల్ట్ నిజంగా ఆరోగ్యకరమా?

