పింక్ సాల్ట్ నిజంగా ఆరోగ్యకరమా?

9
- Advertisement -

పింక్ సాల్ట్ నిజంగా ఆరోగ్యకరమా? లేక కేవలం మార్కెటింగ్ ట్రిక్ మాత్రమేనా? అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో తలెత్తుతోంది. ఎందుకంటే దేశంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది సాధారణ అయోడైజ్డ్ ఉప్పును వదిలి పింక్ సాల్ట్‌ను ఉపయోగిస్తున్నారు.

పింక్ సాల్ట్‌లో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయని భావించి చాలామంది దాన్ని ఎంచుకుంటున్నారు. కానీ ఒక స్పూన్ పింక్ సాల్ట్‌లో ఉండే ట్రేస్ మినరల్స్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవసరమైన మినరల్స్‌ను పొందాలంటే చాలా ఎక్కువ పరిమాణంలో పింక్ సాల్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇది ఆరోగ్యానికి హానికరం.

పింక్ సాల్ట్‌ను ఆరోగ్యకరమని ప్రచారం చేయడం ఒక మార్కెటింగ్ ట్రిక్‌ మాత్రమే. సాధారణ టేబుల్ సాల్ట్‌లో అయోడిన్ కలిపి ఉంటుంది. ఇది అయోడిన్ లోపంతో వచ్చే వ్యాధులను నివారించడానికి ఉపయోగపడుతుంది. 1960లలో భారత్‌లో అయోడిన్ లోపం తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉండేది. దీనివల్ల థైరాయిడ్ సమస్యలు, గర్భిణీలలో సంక్లిష్టతలు, పిల్లల్లో మెదడు అభివృద్ధి లోపాలు వంటి సమస్యలు ఎదురయ్యేవి.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

ప్రస్తుతం పింక్ సాల్ట్ వైపు మొగ్గు చూపడం వల్ల అయోడిన్ లోపం మళ్లీ పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయోడిన్ సరిపడ మోతాదులో ఉంటే థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవచ్చు. అధికంగా ఉప్పు తీసుకోవడం ఏదైనా హానికరమే. అయితే సమతుల్య పరిమాణంలో తీసుకుంటే సాధారణ అయోడైజ్డ్ ఉప్పు తక్కువ ధరలో, సులభంగా లభించే మరియు పోషకపరంగా విశ్వసనీయమైన ఎంపికగా ఉంటుంది.

- Advertisement -