త్వరలో భారత్‌కు మాల్యా అప్పగింత..!

259
vijay mallya

బ్యాంకులకు వేల కోట్ల రుణం ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు త్వరలోనే తీసుకున్నారు. మాల్యా అప్పగింతకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.

త‌న‌ను భార‌త్‌కు అప్ప‌గించ వ‌ద్దు అంటూ విజ‌య్ మాల్యా పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను లండ‌న్ కోర్టు మే 14వ తేదీన కొట్టివేసింది. తాను బాకీలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

2016లో దేశం విడిచివెళ్లిన మాల్యాపై చీటింగ్‌, నేర కుట్ర‌, నిధుల దుర్వినియోగం లాంటి కేసులు నమోదుకాగా వీటిపై సీబీఐ విచార‌ణ జరుగుతోంది.