భారీ స్థాయిలో “సర్కార్” మూవీ

302
- Advertisement -

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం “సర్కార్”. దీపావళి
కానుకగా “సర్కార్” సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 750 థియేటర్లలో విడుదలకు
సిద్దంగా ఉండగా.. తమిళనాడులో సుమారు 700 థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు ఈ మూవీ రెడీ
అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్
నటిస్తోంది. అయితే ఇదివరకు మూవీ టైటిల్ పై ఓ వివాదం నెలకొంది. తన కథను మురుగదాస్ దొంగలించారని
రచయిత వరుణ్‌ రాజేంద్రన్ కోర్టును ఆశ్రయించారు. “సెంగోల్” అనే టైటిల్‌తో తాను రిజిస్టర్ చేసుకున్న
కథను మురుగదాస్ “సర్కార్” మూవీ తీశారని పిటీషన్‌ పేర్కొన్నారు. ఈ వివాదంపై కోర్టు విచారణ
జరిపింది. ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్, రచయిత రాజేంద్రన్ రాజీ పడ్డారని నిర్మాణ సంస్థ
సన్‌పిక్చర్స్ ప్రకటించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అన్ని అడ్డుంకులు తొలిగాయని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు “సర్కార్” రానుందని యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో విజయ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం కోసం తెలుగు, తమిళ అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -