నచ్చిన హీరో కొత్త సినిమా వస్తుందంటే మనొళ్లు విడుదలైన ఫస్ట్ నాడే చూడాలనుకుంటరు.. అసొంటిది ఆ హీరోనే మన ఊరుకు వస్తుండని తెలిస్తే.. ఇంకెట్లుంటది.. రేపొస్తుండని తెలిస్తే ఇవాళ సగం మందికి నిద్రనే రాదు.. కొత్త బట్టలు తొడగాలే.. నెత్తి మంచిగ దూసుకోవాలే.. సెల్‌ఫోన్ల నిండా ఛార్జింగ్ పెట్టాలే.. అందరి కంటే ముందే ఆయన అచ్చే అడ్రస్‌కు పోవాలే అని అనుకుంటరు.
అట్లనే కొందరికి ఆనందం వచ్చినా.. ఆవేశం వచ్చిన ఏది ఆపుకోరు. తమ అభిమాన హీరో కోసం టాకీసులను సింగారిస్తరు.. గుమ్మడికాయతోటి దిష్టి తీస్తరు. కటౌట్‌కు నిమ్మకాయ దండలేస్తరు. పటాకులు కాలుస్తరు.. మిఠాయిలు పంచుతరు.. ఎగుర్తరు. దుంకుతరు.. ఓ సిన్నగుండది..ఎక్కడో ఉండే హీరో ఇవన్ని సూస్తడ.. సూడనప్పుడే ఇట్లుంటే ఇగ అభిమాన హీరో తమ దగ్గరికి వస్తే ఎట్లుంటది..
ఓ పెళ్లి వేడుకకు ఒచ్చిండు హీరో విజయ్.. విజయ్ అంటే తమిళ హీరో.. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ తో సమానంగా ఉంటది ఫ్యాన్ ఫాలోయింగ్ విజయ్‌కి. ఆయన సినిమాలు విడుదలవుతున్నాయంటే ఫ్యాన్స్ కు పండగే.. అయితే విజయ్ ఇటీవల తన భార్యతో కలిసి ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. ఆయన అభిమాని, అభిల భారత అభిమాన సంఘం అధ్యక్షుడు, పాండిచ్చేరి మాజీ శాసన సభ్యుడు ఆనంద్ కూతురు వివాహానికి హజరయ్యాడు. అయితే తమ ఊరికి హీరో విజయ్ వస్తున్నాడని తెలియడంతో ఆయన అభిమానులు హంగామా చేశారు.
విజయ్ పెళ్లి వేడుకకు రాగానే అభిమానుల ఆయనను చుట్టుముట్టారు. సెల్పీ పోటోల కోసం, షేక్ హ్యాండ్ కోసం ఎగబడ్డారు. అభిమానుల నుంచి తప్పించుకోవడానికి విజయ్ చాలానే కష్టపడాల్సి వచ్చింది. విజయ్‌ను బౌన్సర్లు కూడా కాపాడలేకపోయారు అంటే అభిమానుల తాకిడి ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అభిమానుల తోపులాటతో ఓ దశలో విజయ్ కింద పడబోయారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. చివరికి పోలీసుల రంగ ప్రవేశం చేసి అభిమానులపై లాఠీ చార్జ్ చేసి విజయ్ దంపతులను అక్కడి నుంచి పంపించేశారు. ఇదేనమ్మా.. .. అభిమానం అంటే..