థియేటర్లకు ట్యాక్సీవాలా వస్తున్నాడు..

264
- Advertisement -

టాలీవుడులో అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవర కొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ట్యాక్సీవాలా అంటూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఫస్ట్ గేర్ అంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు విజయ్.

Vijay Deverakonda

నవంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘ట్యాక్సీ వాలా’ సినిమాతో అర్జున్ రెడ్డిని మరిపిస్తానని తెలిపారు. ఈ సినిమాలో తాను క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తానని .. ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. నా నుంచి అభిమానులు ఆశించే విధంగా ఈ సినిమా ఉంటుందన్నారు.

ఇందులో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కింది.

- Advertisement -