విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ విందుకు (రిసెప్షన్) సంబంధించి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరగనున్న ఈ గ్రాండ్ రిసెప్షన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కల్పించనున్నారు.పోలీసుల కఠిన భద్రత, ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగే QR కోడ్ వ్యవస్థతో ఈ వేడుకను పూర్తిగా ఆహ్వానితులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు.
రిసెప్షన్‌కు హాజరయ్యే ప్రతి అతిథి వద్ద యూనిక్, ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగే QR కోడ్ ని రెడీ చేశారు. అలాగే ఈ ప్రత్యేక QR కోడ్ లేకపోతే ఎవరికి కూడా ప్రవేశం ఉండదు. అతిథుల జాబితాలో ఉన్నవారికే ఈ కోడ్‌లు పంపించినట్లు వెల్లడించింది.
ఆహ్వానం మరియు QR కోడ్ లేని వారు దయచేసి కార్యక్రమానికి రావద్దు. ఈ వేడుక పూర్తిగా పోలీసుల పర్యవేక్షణలో జరుగుతుంది అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. వేడుక ప్రాంగణం వద్ద గుమికూడకుండా ప్రజలు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి నటించిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి.

