విజయ్…నోటా ‘క్లీన్ యు’

204
vijay nota
- Advertisement -

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ‘నోటా’ మూవీతో తన రౌడీస్‌లో మళ్ళీ జోష్‌ పెంచేందుకు రెడీ అయ్యాడు. ఆనంద్‌ శంఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను కూడా పూర్తి చేసుకుంది. క్లీన్ యు సర్టిఫికేట్ పొంది ఒక్క కట్ లేకుండా ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తుండగా ఈ సినిమాలో ఒక సాధారణ యువకుడిగా .. ముఖ్యమంత్రిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. విడుద‌ల‌కు ముందే విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ ల‌లో రెండు భారీ ప‌బ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 30న విజ‌య‌వాడ‌.. అక్టోబ‌ర్ 1న హైద‌రాబాద్ లో నోటా పబ్లిక్ మీటింగ్‌లు జరగనున్నాయి.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన పొలిటిక‌ల్ డ్రామా నోటా.సాంకేతిక నిపుణులు:ద‌ర్శ‌కుడు: ఆనంద్ శంక‌ర్,నిర్మాత‌: కేఈ జ్ఞాన‌వేల్ రాజా,నిర్మాణ సంస్థ‌: స‌్టూడియో గ్రీన్,క‌థ‌: షాన్ క‌రుప్పుసామి,సంగీతం: స‌్యామ్ సిఎస్,సినిమాటోగ్ర‌ఫీ: శాంత‌న కృష్ణ‌ణ్,ఎడిట‌ర్: రేమాండ్ డెరిక్ క్రాస్టా,ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్: డిఆర్కే కిర‌ణ్,పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

- Advertisement -