అరవింద సమేత..ప్రీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

241
Aravindha Sametha pre release on Oct 2nd
- Advertisement -

త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా‘అరవింద సమేత వీర రాఘవ’.ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై చినబాబు నిర్మించగా యాక్షన్‌,ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కుతోంది.

దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ప్రీ రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Aravinda Sametha

గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవోటెల్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. అయితే ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారో అన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్‌గా ఉంచింది చిత్రయూనిట్.

- Advertisement -