ఫ్రాన్స్‌లో విజయ్‌ దేవరకొండ హంగామా..

280
Vijay Deverakonda
- Advertisement -

టాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా న‌టించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్. ఈ చిత్రం జూలై 26న నాలుగు భాష‌ల‌లో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న‌ ‘హీరో’ అనే చిత్రంలో నటిస్తుండగా ఇటీవ‌ల ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం ష్యూటింగ్‌ మొదలుకానుంది.

ఇక క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై క్రాంతిమాధవ్ దర్శకత్వం మరో మూవీ చేస్తున్నాడు విజయ్‌. ఇందులో ప్రధాన కథానాయికగా రాశి ఖన్నా నటిస్తుండగా, మరో ఇద్దరు కథానాయికలుగా ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ఫ్రాన్స్‌లో జరుగుతోంది. నాయకా నాయికలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌కి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఏమిటనేది త్వరలోనే ప్రకటించనున్నారు.

- Advertisement -