టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తాజాగా విజయ్.. ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా తన ఆరో ఎడిషన్‌ను ప్రకటించగా… అందులో ఇండియాకు చెందిన 30 ఏళ్లలోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఫోర్బ్స్ ఎంపిక చేసింది. దాంట్లో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చోటు దక్కించుకున్నాడు.
ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్ కేటగిరీలో విజయ్‌ని ఎంపిక చేశారు. అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్‌బస్టర్‌తో విజయ్ దేవరకొండ తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. విజయ్ సినిమా కెరీర్‌కు అర్జున్ రెడ్డి ఓ మలుపు అని అభివర్ణించింది. అంతేకాదు విజయ్ మొదటి సారి నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా 2019లో విడుదల కాబోతున్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. ఇక విజయ్ దేవరకొండ ‘రౌడీ’ పేరిటి దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్‌కు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది.
విజయ్ 2011లో ‘నువ్విలా’ సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో అతిథి పాత్రలో సందడి చేశారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తర్వాత వచ్చిన ‘పెళ్లిచూపులు’ హిట్ అందుకుంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్‌కు నటుడిగా సెన్సేషనల్ హిట్‌ను ఇచ్చింది. ఈ ఒక్క చిత్రంతో ఆయన బాలీవుడ్ ప్రముఖులకు కూడా సుపరిచితులయ్యారు. గత ఏడాది ఆయన ‘మహానటి’, ‘గీత గోవిందం’ సినిమాలతో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో బిజీగా ఉన్నారు.
#ForbesIndia30U30 | Class of 2019 – Entertainment & Music: Vijay Deverakonda (@TheDeverakonda), Actor https://t.co/vyoCQZxvAY pic.twitter.com/QUa8sQZ2xK
— Forbes India (@ForbesIndia) February 4, 2019