ఆకట్టుకుంటున్న ‘గీత గోవిందం’ టీజర్…

242
Vijay Deverakonda
- Advertisement -

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా.. ఛలో ఫేం హీరోయిన్ రష్మిక మందన కథాయినాకగా నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. గీతా ఆర్ట్స్ బ్యానర్‏‏లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ అండ్ ఎంటర్‏‏టైన్‏‏గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కొద్ది సేపటి క్రితం ఈ చిత్ర టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Vijay Geetha Govindam

ముందు హీరో విజయ్ దేవరకొండ తన హీరోయిన్‏‏తో కలలో సీన్ వేసుకుంటాడు. యువరైతు వేషధారణలో ట్రాక్టర్ నడుపుతూ వస్తుంటాడు.. అందే సమయంలో రేడియోలో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.. సాంగ్‏‏కి హీరోయిన్‏‏ని భార్యగా ఊహించుకుంటాడు. విజయ్.. రష్మికను భార్యగా రొమాంటిక్‏‏గా ఊహించుకునే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. వెంటనే రష్మిక, విజయ్ చెంప చెల్లుమనిపించడం.. ఇంకోసారి అమ్మాయిలు..ఆంటీలు అంటూ తిరగావంటే యాసిడ్ పోసేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చే సీన్ ఆకట్టుకుంటుంది.

‘ఇక మారవా నీవు’ అంటూ హీరోయిన్ అడగగా.. ‘లేదు మేడం మారిపోయా అయామ్ కంప్లీట్ లీ డీసెంట్ నౌ’ అంటూ విజయ్ చెప్పే డైలాగ్ యూత్‏‏ని ఆకర్శిస్తోంది. హీరోయిన్ ప్రేమ కోసం హీరో పడుతున్న ఇబ్బందులను దర్శకుడు ఆసక్తిగా తెరకెక్కించాడు. రొమాన్స్.. కామెడీతో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ నెల 29న ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు.

- Advertisement -