వీణ్ని తొక్కేయాల్సిందే…!

176
Vijay Devarakonda's arrogant speech
Vijay Devarakonda's arrogant speech
- Advertisement -

పెళ్లి చూపులు హీరో విజయ్‌దేవర కొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ రెడ్డి. సందీప్ వంగ డైరెక్షన్‌లో తెరకెక్కింది. ఈ మూవీ ఈ నెల 25వ తేదిన విడుద‌ల కానుంది. విజ‌య్ ఈ మూవీలో మెడికల్ కాలేజీ స్టూడెంట్‌గా కనిపించనున్నాడు. అత‌డికి జోడీగా శాలిని నటిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌ను సోమవారం సాయంత్రం హైద‌రాబాద్ లోని ఎన్ క‌న్వేన్ష‌న్ సెంట‌ర్లో నిర్వ‌హించారు. ముఖ్య అతిథులుగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, సుకుమార్,తరుణ్‌భాస్కర్‌, నందినిరెడ్డి, క్రాంతి మాధవ్‌, శివ నిర్వాణ, స్వప్న దత్‌ తదితరులు హాజ‌రయ్యారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘సోషల్‌ మీడియాలో ఈ సినిమాపై నాకు అతి నమ్మకం ఉందని విమర్శలు వచ్చాయి. నా సినిమా మీద నాకు నమ్మకం లేకపోతే.. ఎవరికుంటది.. ప్రతి ఫిల్మ్‌ మేకర్ నైట్ మేర్ సెన్సార్ బోర్డు.. కానీ సెన్సార్‌వాళ్లు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్‌ ఇచ్చారు. నాకు ఎక్కడ కాలిందంటే ఏ సర్టిఫికెట్ ఇచ్చినంక కొన్ని మ్యూట్లు అడిగారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సీన్ ఉంది.. ఆ సీన్‌లో ఒక పదాన్ని వాడాల్సిన అవసరం ఉంది.. ఏం మాట్లాడుతున్నావ్‌రా.. అనే పదాన్ని ఎలా వాడుతామన్నారు.. సో మీఅందరినుండి నాకు ఒక ప్రామిస్ చేయలి.. థియేటర్లో నా నోరు మూయిస్తారేమో… కానీ మీ నోళ్లు మూయించలేరు.. సో ఆ సీన్ వచ్చినపుడు నన్ను మ్యూట్ చేసినపుడు మీరంతా నాకు డబ్బింగ్ చెప్పాలి. ఈ సినిమాతో యువతరం తలెత్తుకొని బతకాలనే సందేశం ఇచ్చాం తప్ప మరొకటి కాదు. రథన్‌ సమకూర్చిన స్వరాలు బాగున్నాయి’’ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక సినిమాని చూశాక మనతో పాటే మనింటికి రావాలి అంటుంటారు కదా… అలాగే ఉంటుందీ సినిమా. ఈ యేడాది వీణ్ని తొక్కేయాల్సిందే అనుకొంటుంటారు కొంతమంది. అలా సెన్సార్‌వాళ్లు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్‌ ఇచ్చార’’న్నారు.నిర్మాత మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొనేలా ఉంటుందీ సినిమా’’ అన్నారు.

- Advertisement -