అఖిల్‌కి హాల్లో చెబుతున్నారు..!

223
Nag’s Unique Clue To Reveal Akhil’s Title

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండవ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలావరకూ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టు లుక్ బయటికి వచ్చింది. ఒక వైపున విలన్ గ్యాంగ్ ను ఉతికి ఆరేస్తూనే .. మరో వైపున హీరోయిన్ తో కూల్ గా రొమాన్స్ చేస్తోన్న అఖిల్ లుక్ యూత్ కి తెగ నచ్చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ ఏమిటనేది మాత్రం రివీల్ చేయలేదు.

రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకి పలు టైటిల్స్ పరిశీలనలోకి వ‌చ్చాయి. అభిమానులు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నాగ్ త‌న ట్విట్ట‌ర్ లో నిర్ణ‌యం సినిమాలోని హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే వీడియో సాంగ్ నాలుగు లైన్ల లిరిక్స్ ని షేర్ చేసి ఇందులోనే టైటిల్ ఉంద‌ని చిన్న హింట్ ఇచ్చాడు.

21brk172-hello

ఇక ‘హలో’ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేయించారనే టాక్ కూడా వినిపించింది. తాజాగా అదే అనే టిటైల్‌ను ఖరారు చేసి పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఈ సినిమా డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న‌ట్టు నాగ్ ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు.