పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమై అందరి దృష్టిని తనవైపు ఆకర్షించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆతర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు. అంతేకాకుండా అర్జున్ రెడ్డి సినిమాతో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. ట్యాక్సివాలా, నోటా, గీతా గోవిందం చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.
విజయ్ దేవరకొండ కు యూత్ మంచి ఫాలోయింగ్ ఉంది. విజయ్ దేవరకొండు రౌడి క్లబ్ అనే వెబ్ సైట్ కూడా ఉన్న విషంయం తెలిసిందే. అయితే తాజాగా విజయ్ దుస్తుల బ్రాండ్ రౌడీ క్లబ్ ను ప్రారంభించనున్నట్లు తెలిపాడు. ఈసందర్భంగా దీనికి సంబంధించిన ప్రమోషన్స్ చేయడంల బిజీగా ఉన్నాడు అర్జున్ రెడ్డి. ఇటివలే రిలీజ్ చేసిన ఈలుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఓ బస్ స్టాప్ షర్ట్ లేకుండా నిలబడి..బస్ స్టాప్ వద్ద ఎదురుచూస్తున్నాను. నాకు నచ్చిన చొక్కా ఇప్పటికి దొరకలేదు. నేనూ మీలాగే రౌడీనే అంటూ ఓ ఫోటో పెట్టి తన ట్వీట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా జరిగిన ఫిలింఫేర్ అవార్డు ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ రౌడి అని రాసి ఉన్న బ్లేజర్ ను వేసుకున్న విషయం తెలిసిందే. తనకు ఇష్టమైన వాళ్లను తన సన్నిహితులను అతను రౌడి అని పిలుచుకుంటాడు. ఈసందర్భంగా రౌడీ క్లబ్ ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు తెలిపాడు.
Waiting at the bus stop.
Still didn't find a shirt that I like.
I am you. I am the Rowdy you.https://t.co/oHdxlqQpCX pic.twitter.com/yLwuWRsN7F— Vijay Deverakonda (@TheDeverakonda) July 11, 2018
‘