ఎన్టీఆర్ బ‌యోపిక్ స్పెష‌ల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్..

198
ntr biopic, rakul

స్వర్గీయ నందమూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్క‌తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈసినిమాను త‌న సొంత బ్యాన‌ర్ లో ఎన్టీఆర్ త‌న‌యుడు, ఎమ్మెల్యే బాల‌కృష్ణ నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టిస్తున్నాడు. ఈచిత్రానికి ప్రముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇటివ‌లే ఈసినిమా రెగ్యూల‌ర్ షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఈసినిమాలో ప‌లువురు సీనియ‌ర్ న‌టులు, మంచి పేరున్న వారు నటిస్తుండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెగుతున్నాయి.

rakul-preet-singh

ఇక ఈమూవీలో న‌టించే వారిపై అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోయిన‌ప్ప‌టికి సోష‌ల్ మీడియాలో ప‌లువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్ర‌లో బాల‌కృష్ణ న‌టించ‌గా..ఆయ‌న స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్రలో విద్యాబాల‌న్ న‌టిస్తుంది. అక్కినేని నాగేశ్వ‌ర్ రావు పాత్ర‌లో నాగ చైత‌న్య న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. తెర‌పైకి ప‌లువురి న‌టిన‌టుల పేర్లు వ‌చ్చినా చిత్ర‌యూనిట్ మాత్రం అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఇక తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం రానా, మోహ‌న్ బాబు, సీనియ‌ర్ న‌రేష్ ప‌లువురు న‌టిస్తున్నార‌ని తెలుస్తుంది.

Ntr-Biopic

అయితే తాజాగా మ‌రో స్టార్ హీరోయిన్ కూడా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ర‌కుల్ ప్రిత్ సింగ్ ను డైరెక్ట‌ర్ క్రిష్ సంప్ర‌దించిన‌ట్టు ఫిలిం వ‌ర్గాల స‌మాచారం. సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ర‌కుల్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో అవ‌కాశం వ‌స్తే న‌టిస్తాన‌ని ర‌కుల్ గ‌తంలో చెప్పిన విష‌యం తెలిసిందే. ఇంత మంది స్టార్ న‌టీన‌టులు ఈసినిమాలో న‌టించ‌డం పై చిత్రంపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు నంద‌మూరి అభిమానులు.