పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం, ట్యాక్సివాలి చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో బిజగా ఉన్న ఈహీరో ప్రస్తుతం డియర్ కామ్రేడ్ మూవీలో నటిస్తున్నాడు. తనకు ఉన్న ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని రౌడి పేరుతో బ్రాండ్ ను స్ధాపించాడు. రౌడి బ్రాండ్ యూత్ లో వైరల్ గా మారింది. ఎక్కువగా రౌడి టీ షర్ట్స్ యూత్ లో ట్రెండ్ గా మారిపోయాయి. విజయ్ ఫ్యాన్స్ తమ అభిమానాన్ని ప్రదర్శించడం కోసం ఏకంగా తమ వాహనాలపై రౌడీ అని రాయించుకోవడం మొదలుపెట్టారు. ఇదే సమస్య వారికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇక కొందరైతే రౌడీ సింబల్‌ని బైక్ నెంబర్ ప్లేట్స్‌పై కూడా వేసుకుంటున్నారు.. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నెంబర్ ప్లేట్ పై రౌడీ సింబల్ వున్న ఓ టూవీలర్ ని పట్టుకుని జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా నెంబర్ ప్లేట్లపై రౌడీ సింబల్ వేసుకోవడం చట్టవిరుద్ధమని ఆగ్రహించిన ట్రాఫిక్ పోలీసులు ఫేస్ బుక్ లో పలువురికి హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా ఫేస్ బుక్ లో ఈపొస్ట్ చూసి స్పందించారు విజయ్ దేవరకొండ. తన అభిమానుల తరపున క్షమాపణలు తెలుపుతున్నానని పోలీసులకు తెలిపాడు. వారిలో చైతన్యం తెచ్చి ఇంకోసారి ఇలాంటి జరగకుండా చూస్తానని అన్నారు. ఈసందర్బంగా విజయ్ అభిమానులను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు. నా ఫ్యామిలీకి సంబంధించిన వారెవరైన కష్టాలలో ఇరుక్కోవడం నేను చూడలేను. కొన్ని రూల్స్ మనం తప్పక పాటించాలి. ఆ రూల్స్ మన మంచి కోసం పెట్టినవే. మీ ప్రేమను ఎవరిపైన అయిన చూపించండి. బైక్ పైన ఎక్కడైన చూపించండి, కాని కానీ నంబర్ ప్లేట్స్‌పై మాత్రం వాహన నంబర్‌నే ఉంచండి అని విజయ్ ట్వీట్ చేశాడు.