విజయ్…లైగర్ అప్ డేట్స్

461
vijay devarakonda
- Advertisement -

వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వలో మూవీ చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసాడు పూరి. అయితే ఈ సినిమాకు ‘ఫైటర్’ తోపాటు ‘లైగర్’ అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తికాగా ప్రస్తుత షెడ్యూల్ ముంబైలో జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు. విజయ్‌,రమ్యకృష్ణ,అనన్యా పాండే,రోణిత్ రాయ్,అలీ తదితరులపై కీలక సన్నివేశాలనతీశారు.

పూరి టూరింగ్ టాకీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ను చార్మీకౌర్,కరణ్ జోహార్,అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. విజయ్ సరసన అనన్య హీరోయిన్‌గా నటిస్తుండగా పాన్ ఇండియా ఫిల్మ్‌గా తెరకెక్కుతోంది. సినిమా బడ్జెట్‌ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు పూరి.

నటీనటులు:విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్యా పాండే, ర‌మ్య‌కృష్ణ‌, రోణిత్ రాయ్‌, విష్ణురెడ్డి, అలీ, మ‌క‌రంద్ దేశ్‌పాండే, గెట‌ప్ శ్రీ‌ను,సాంకేతిక బృందం:సినిమాటోగ్రాఫ‌ర్‌: విష్ణుశ‌ర్మ‌,ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖీ,ఆర్ట్‌: జానీ షేక్ బాషా,స్టంట్స్‌: కెచ్చా,నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మీ కౌర్‌, క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా,క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

- Advertisement -