రజనీ విత్ బేర్ గ్రిల్స్.. ట్రైలర్

500
rajini
- Advertisement -

డిస్క‌వ‌రీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఓ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రపంచ సాహసికుడు బేర్ గ్రిల్స్ ప్రముఖులను కూడా తన వెంట కొండకోనల్లో, దట్టమైన అరణ్యాల్లో తిప్పుతూ చేసే అడ్వెంచరస్ కార్యక్రమం ‘ఇంటూ ద వైల్డ్’. డిస్కవరీ చానల్ కోసం తానొక్కడే ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరిట సింగిల్ ఎపిసోడ్లు రూపొందించే బేర్ గ్రిల్స్ అప్పుడప్పుడు వరల్డ్ సెలబ్రిటీలను తన వెంటేసుకుని తిప్పుతూ ‘ఇంటూ ద వైల్డ్’ పేరిట స్పెషల్ డాక్యుమెంటరీలు చిత్రీకరిస్తుంటాడు.

గ‌త ఏడాది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో డిస్క‌వ‌రీ ఛానెల్ కోసం బేర్ గ్రిల్స్ ఓ వీడియోని షూట్ చేసి సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా ఇటీవ‌ల త‌మిళ‌ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌లో `మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్` కార్య‌క్ర‌మం కోసం ఓ డాక్యుమెంట‌రీని షూట్ చేశారు. క‌ర్ణాట‌క‌లోని బందీపూర్ రిజ‌ర్వ్ ఫారెస్ట్‌లో దీనికి సంబంధించిన షూటింగ్ జ‌రిగింది. అయితే రజనీ విత్ బేర్ గ్రిల్స్’ ఎపిసోడ్ డిస్కవరీ ఇండియా చానల్లో ఈ నెల 23న రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్‌లో ర‌జ‌నీ అభిమానుల్ని ఎంతగానో ఆక‌ట్టుకున్నాడు.

- Advertisement -