‘లైగర్’ తర్వాత విజయ్ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉందనుకునేలోపే రెండు సినిమాలను టకటకా ఎనౌన్స్ చేశారు. ఖుషి తర్వాత గౌతం తిన్ననూరి , పరశురామ్ లతో సినిమాలు చేయబోతున్నాడు. నిజానికి ఏ మధ్య కాలంలో విజయ్ కి టైమ్ కలిసి రాలేదు. దీంతో చేసిన సినిమాలన్నీ ఒకటి తర్వాత మరొకటి అపజయాలు అందించాయి. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో విజయ్ కెరీర్ గ్రాఫ్ మరింత డౌన్ అయ్యింది. ఇప్పుడు మూడు సినిమాలతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టి మళ్ళీ తన సత్తా చాటాలని భావిస్తున్నాడు.
ఖుషి సినిమాకు సంబంధించి షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. సమంత డేట్స్ ఇస్తే కానీ సినిమా పూర్తవదు. అందుకే ఈ లోపు రిలాక్స్ అవుతున్నాడు విజయ్. అలాగే నెక్స్ట్ లైనప్ మీద ఫోకస్ పెట్టి మరిన్ని కథలు వింటున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్ తో ప్రాజెక్ట్ ను మళ్ళీ సెట్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇక సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ , ప్రభాస్ లతో సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి విజయ్ కి ఈ సినిమాలు ఎలాంటి విజయాలు అందిస్తాయో ?
ఇవి కూడా చదవండి..