న్యూ లుక్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌…సోష‌ల్ మీడియాలో వైర‌ల్

230
vijay new look
- Advertisement -

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న్యూలుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు. లాక్ డౌన్ లో కార‌ణంగా గ‌త రెండు నెల‌లుగా ఇంట్లోనే ఉంటున్న విజ‌య్ ఒక్క‌సారిగా అభిమానుల‌కు స‌ర్ ప్రైజ్ ఇచ్చారు. విజ‌య్ కొత్త లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. న్యూలుక్ పై సోష‌ల్ మీడియాలో విజ‌య్ మీద జోకులు వేసుకుంటున్నారు నెటిజ‌న్లు. ఫాదర్స్ డే సందర్భంగా విషెష్ చెబుతూ తన కొత్త లుక్‌లో తండ్రితో కలిసి దిగిన పిక్స్ షేర్ చేశారు విజయ్ దేవరకొండ.ఈలుక్ లో విజ‌య్ ఫ్రెంచ్ గ‌డ్డంతో పాటు జుంపాల హేర్ తో ద‌ర్శ‌న‌మిచ్చాడు.

త‌న త‌మ్ముడి‌తో క‌లిసి దిగిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గామారింది. విజ‌య్ న్యూలుక్ పై ప‌లువురు నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శక‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఈమూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్తి చేసుకుంది. అయితే ఫైట‌ర్ సినిమా కోసం విజ‌య్ ఈ కొత్త లుక్ లో క‌నిపించాడని స‌మాచారం. ఈమూవీఈలో విజ‌య్ బాక్సార్ గా క‌నిపించ‌నున్నాడు. పూరీ జగ‌న్నాథ్, బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీలో అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తుంది.

- Advertisement -